బ్రేకింగ్; వైద్యులపై దాడి చేస్తే 7 ఏళ్ళ జైలు, కేంద్రం ఆర్డినెన్స్…!

-

కేంద్ర కేబినేట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కేంద్ర సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. వైద్యులకు పూర్తి స్థాయి భద్రత దిశగా కేంద్రం అడుగులు వేసింది. కరోనా లాక్ డౌన్, ఆర్ధిక పరిస్థితి పై చర్చించారు. డాక్టర్లపై దాడులు చేస్తే సీరియస్ గా తీసుకుంటామని, వైద్యులపై దాడులు అరికట్టడానికి గానూ ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. వైద్యులకు నర్సులకు 50 లక్షల బీమా కల్పించింది కేంద్రం

డాక్టర్లపై దాడులు చేస్తే మూడు నెలల నుంచి 7 ఏళ్ళ పాటు జైలు శిక్ష విధిస్తారు. రూ 50 వేల నుంచి 2 లక్షల వరకు జరిమానా విధిస్తారు. ఆస్పత్రుల మీద దాడులు చేస్తే మార్కెట్ విలువ కంటే ఎక్కువ వసూలు చేస్తామని కేంద్రం హెచ్చరించింది. ఆర్డినెన్స్ లో కూడా దీనిని పొందు పరిచారు. వైద్యులు సఫాయి కార్మికులపై దాడిని కేబినేట్ ఈ సందర్భంగా ఖండించింది. 1987 ఎపిడమిక్ చట్టంలో మార్పులు చేసింది కేంద్రం.

రాష్ట్రపతి సంతకం చేస్తే ఈ ఆర్డినెన్స్ అమలులోకి వస్తుంది. వెంటనే దీనికి రాష్ట్రపతి ఆమోదం కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా… ప్రధానంగా ఉత్తరాది రాష్ట్రాల్లో వైద్యులపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. అలాగే తెలంగాణా రాజధాని హైదరాబాద్ లో కూడా దాడులు చేస్తున్నారు. దీనితో వైద్యులు ఇప్పుడు చికిత్స చేయడానికి భయపడే పరిస్థితి ఏర్పడింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news