గడిచిన 24 గంటల్లో 3,49,691 కేసులు… కోవిడ్ వలన కలిగే ఇబ్బందులు తప్పవా…?

-

కరోనా వైరస్ కేసులు ఎక్కువై పోయాయి. రోజు రోజుకి లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి. కరోనాని కట్టడి చెయ్యడం కుదరడం లేదు. గడిచిన ఇరవై నాలుగు గంటల్లో 3,49,691 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయినట్టు తాజా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం వెల్లడైంది. అదే విధంగా 2,767 మంది వైరస్ కారణంగా మరణించారు.

ఇది ఇలా ఉంటే దేశంలో ఎంతో మంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఎందుకంటే ఆక్సిజన్ మరియు ఔషధాలలో కొరత ఎక్కువైంది. దీనితో పరిస్థితి మరెంత తీవ్రంగా మారింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం అయితే గత 24 గంటల్లో 2,17,113 మంది డిశ్చార్జ్ అయ్యారు మరియు 26,82,751 యాక్టివ్ కేసులు వున్నాయి.

అలానే మొత్తం రికవరీలు 1,40,85,110 మంది ఉండగా, మరణాల రేటు 1.13 శాతం ఉంది.  ఐసిఎంఆర్ ప్రకారం ఏప్రిల్ 24 నాటికి 27,79,18,810 సాంపిల్స్ ని టెస్ట్ చేసారు. ప్రభుత్వ టీకాల ద్వారా 14,09,16,417 మంది కరోనా టీకాలని వేయించుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news