వ్యాక్సిన్ తో రేషన్, పెన్షన్ లింక్, తీసుకోకుంటే కష్టమే !

దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగి పోతున్నా సరే ఇంకా కొంతమంది వ్యక్తులు తీసుకోవడానికి వెనకాడుతున్నారు.. వ్యాక్సిన్ వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని కొందరు ప్రచారం చేస్తూ ఉండడం తో వ్యాక్సిన్ తీసుకోవడానికి చాలామంది భయపడుతున్న పరిస్థితి. అయితే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కేవలం ఒకటి రెండు రోజులు మాత్రమే ఉంటాయని ఆ తర్వాత కచ్చితంగా వ్యాక్సిన్ కరోనా నుంచి రక్షణ లభిస్తుందని వైద్యులు నిపుణులు ఎంతమంది చెబుతున్నా జనం వినడం లేదు.

VACCINE
VACCINE

ఈ నేపథ్యంలో తెలంగాణలో ఒక మండల తహసీల్దార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ తహసీల్దార్ సువర్ణ కీలక ఆదేశాలు జారీ చేశారు. కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటేనే నెల నెలా ఇచ్చే రేషన్ పంపిణీ చేస్తామని, అలాగే టీకా తీసుకుంటేనే పెన్షన్ ఇస్తామని గ్రామాల్లో చాటింపు వేయించారు. దీంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.