తెలంగాణలో కొత్తగా 507 కొవిడ్‌ కేసులు

-

తెలంగాణలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. ముఖ్యంగా విద్యార్థులపై తన పంజా విసురుతోంది. తాజాగా ప్రజాప్రతినిధులు కూడా కొవిడ్ బారిన పడుతున్నారు. అప్రమత్తమైన ఆరోగ్య శాఖ అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రజలను అప్రమత్తం చేసి కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించింది. అందరూ మాస్కులు తప్పక ధరించాలని చెప్పింది.


రాష్ట్రంలో కొత్తగా 507 కొవిడ్‌ కేసులు నమోదు కాగా.. మొత్తం బాధితుల సంఖ్య 8,30,380కి పెరిగింది. తాజాగా మరో 605 మంది కోలుకోగా.. ఇప్పటి వరకూ 8,23,272 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఈ నెల 17న సాయంత్రం 5.30 గంటల వరకూ నమోదైన కరోనా సమాచారాన్ని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు బుధవారం వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,997 క్రియాశీల కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 33,046 నమూనాలను పరీక్షించగా.. మొత్తం పరీక్షల సంఖ్య 3,70,76,711కు పెరిగింది.

తాజా ఫలితాల్లో హైదరాబాద్‌లో కొత్తగా 205, రంగారెడ్డిలో 42, మల్కాజిగిరిలో 41, మేడ్చల్‌ నల్గొండలో 23, కరీంనగర్‌లో 22, ఖమ్మంలో 15, మంచిర్యాలలో 15, మహబూబ్‌నగర్‌లో 12, సంగారెడ్డిలో 11, యాదాద్రి భువనగిరిలో 10 చొప్పున పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రంలో మరో 1,15,628 కొవిడ్‌ టీకా డోసులను పంపిణీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news