భారత్‌లో కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. రోజు రోజుకీ రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం నిన్న కొత్తగా 83,883 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో భారత్ లో కరోన కేసులు 38 లక్షలు దాటాయి. ఇక నిన్నటి కేసులతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 38,53,407కు చేరింది. నిన్న ఒక్కరోజే 1,043 మంది కరోనాకు బలయ్యారు.
దీంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారితో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 67,376కి చేరింది. మొత్తం బాధితుల్లో సుమారు 29 లక్షల మందికి పైగా కోలుకోగా 8 లక్షల మందికి పైగా చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా కొవిడ్ నిర్ధారణ పరీక్షలు భారీగా చేపట్టడంతో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ చెబుతోంది. ప్రస్తుతం 8,15,538 యాక్టివ్ కేసులు ఉండగా 29,704,93 కేసులు నయం అయినవి ఉన్నాయి. ఇక రోజు రోజుకీ కేసులతో పాటు మరణాలు కూడా పెరగడం టెన్షన్ పెడుతోంది.