రష్యాలో మళ్ళీ మొదలయ్యింది.. ఇక కష్టమే..!

మొన్నటి వరకు కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించిన కరోనా వైరస్ ప్రస్తుతం కొన్ని దేశాల్లో మళ్లీ విజృంభిస్తుంది. ప్రజలందరినీ బెంబేలెత్తిస్తున్న విషయం తెలిసిందే ముఖ్యంగా రష్యాలో రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. కేవలం శుక్రవారం ఒకే రోజు రికార్డు స్థాయిలో 22702 కొత్త కేసులు నమోదు కావడం అక్కడి ప్రజలందరినీ తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది. ఇక ఇప్పుడు వరకు ఏకంగా రష్యాలో 19 లక్షల వరకు కేసులు నమోదయ్యాయి.

 

ఇటీవలే రష్యాలోని కరోనా రెస్పాండ్ సెంటర్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. అయితే 22 వేల కేసులు బయటపడగా అందులో దాదాపుగా 6500 కేసులు కేవలం రష్యా రాజధాని మాస్కోలో నే బయటపడినట్లు ఇటీవలే అధికారులు వెల్లడించారు. ఇక రోజు రోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న తరుణంలో అటు ప్రభుత్వం కూడా మళ్లీ కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.