ఆకాశమే హద్దు రా.. మోహన్ బాబు అభిమానుల్లో నిరుత్సాహం..!?

-

ప్రస్తుతం తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా సుధ కొంగర దర్శకత్వంలో ఆకాశమే నీ హద్దురా అనే సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. ఇక ఎన్నో రోజుల తర్వాత సూర్య నటించిన సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకోవడంతో అటు సూర్య అభిమానులందరూ ఎంతో ఉత్సాహం పడిపోతున్నారు. ఇక ఈ సినిమాలో సూర్య నట విశ్వరూపం చూశామని అభిమానులూ మురిసిపోతున్నారు. కానీ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన మోహన్ బాబు అభిమానులు మాత్రం షాక్ అవుతున్నారు.

మోహన్బాబు దాదాపు 40 ఏళ్ల తర్వాత తమిళంలో నటించిన విషయం తెలిసిందే ఇక ఆర్మీ అధికారి పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది అని అభిమానులు అనుకున్నారు. ఇంత చిన్న పాత్రలో మోహన్ బాబు నటించేందుకు ఎందుకు ఒప్పుకొని ఉంటారు అంటూ అభిమానులు షాక్ అవుతున్నారు. మోహన్ బాబు స్థాయి నటుడికి ఇలాంటి పాత్ర ఇస్తారా అంటూ అటు సోషల్ మీడియా వేదికగా చిత్రబృందం కూడా ప్రశ్నిస్తున్నారు. ఇలా ఓ వైపు సూర్య అభిమానులు ఉత్సాహంలో మునిగిపోతే మరోవైపు మోహన్ బాబు అభిమానులు మాత్రం ఆయన పాత్ర విషయంలో నిరుత్సాహం గానే ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news