కరోనా వైరస్ సోకితే యువకులు చనిపోయే అవకాశం లేదనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. కాని అది నిజం కాదని అంటున్నారు. చైనాలో ఎక్కువగా వృద్ధులే ప్రాణాలు కోల్పోయినా, ఇటలీ లో కూడా వాళ్ళే చనిపోయినా… కొన్ని దేశాల్లో మాత్రం యువకులు ఎక్కువగా ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. అమెరికాలో కరోనా కారణంగా యువకులే ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారు.
బ్రిటన్‌లో 13 ఏళ్ల బాలుడు కరోనా మహమ్మారి బారినపడి చనిపోయాడు. అతనికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని కేవలం కరోనా ఒక్కటే సోకింది అని అంటున్నారు. మంగళవారం ఉదయం బెల్జియంలో 12 ఏళ్ల బాలిక మరణించింది. ఫ్రాన్స్‌లోనూ 18 ఏళ్ల యువకుడు కరోనాతో కన్నుమూశాడు. ఉత్తరప్రదేశ్ బస్తి జిల్లాకు చెందిన 25 ఏళ్ల యువకుడు కరోనాతో మరణించాడు. దీనితో ఆందోళన వ్యక్తమవుతుంది.
కరోనా వైరస్ తో ఇప్పటి వరకు 42వేల మందిని బలితీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది పిల్లలు, యువకులు కూడా కరోనా వైరస్ కి బలవుతున్నారు. దీనితో ఇప్పుడు యువకులు కూడా కరోనాకు బలవడం ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతుంది. చాలా మంది యువకులు అమెరికాలో కోరనా కారణంగా బలవుతున్నారని, మృతుల్లో దాదాపు వెయ్యి మంది ఇప్పుడు కరోనా కారణంగా మరణించారని అంటున్నారు.