రాజకీయాలకి ఇది సమయం కాదు అని బుర్ర ఉన్న ఎవ్వడికైనా అర్ధం అవుతుంది .. వీళ్ళకి తప్ప !

-

దేశంలో ఎక్కడా లేని చెత్త మీడియా తెలుగు మీడియా అని చాలామంది అంటారు. తెలుగు మీడియా కి ప్రజా సమస్యల కంటే కులపిచ్చి రాజకీయ పిచ్చి ఉన్నంత పిచ్చి దేశంలో మరో రాష్ట్రంలో ఉన్న మీడియాలకు ఉండదని చాలా మంది ప్రముఖులు అంటుంటారు. ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా వైరస్ గురించి విలవిలలాడుతుంటే తెలుగు మీడియా మాత్రం రాజకీయాలకు ప్రాధాన్యతనిస్తూ వరుస కథనాలు ప్రసారం చేయటం ఇళ్లల్లో ఉన్న చాలా మందికి అసహనాన్ని కలిగిస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల బట్టి మీడియా ప్రభుత్వం మరియు రాజకీయ పార్టీలు అన్న విషయాలను పక్కనపెట్టి ప్రజల కోసం కలిసికట్టుగా పని చేయాల్సిన పరిస్థితి ఉంది.Communication and Public Relation - Excel Mediaఅయితే తెలుగు మీడియా రంగంలో కొన్ని మీడియా ఛానల్స్ ఇటువంటి దారుణమైన కష్ట సమయంలో తమ సొంత ప్రయోజనాలను అదే విధంగా తమకు మద్దతుగా ఉండే రాజకీయ నాయకులకు పార్టీలకు ప్రయోజనాలు చేకూరే విధంగా కథనాలు మరియు రాతలు రాయటం పట్ల తెలుగు ప్రజలు చిరాకు పడుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై అదే విధంగా వైయస్ జగన్ పై ప్రజలలో తీవ్ర వ్యతిరేకతను పెంచడానికి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా వ్యవహరిస్తున్న తీరు జర్నలిజంపై అసహ్యాన్ని కలిగిస్తున్నాయి. ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచడానికి ఎక్కడ తప్పు దొరుకుతుందా? ఎక్కడ శవం దొరుకుతుందా ? అన్నట్టుగా కాచుకు కూర్చున్నట్లు ఇటీవల ఒక సందర్భం బట్టి అర్థమవుతుంది.

 

పూర్తి విషయంలోకి వెళ్తే గ్రామ వాలంటీర్లు సరిగా పనిచేయడం లేదని..రేషన్ సరుకులు ఇంటికి తెచ్చి ఇవ్వడం లేదని.. అందువల్లే ఓ మహిళ చనిపోయిందని.. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరిగిందంటూ కొన్ని తెలుగు దేశం అనుకుల మీడియా సంస్థలు రెచ్చిపోయి వార్తలు ప్రసారం చేశాయి. దీంతో ఏపీ లో ఉన్న ప్రజలు ఒకపక్క కరోనా వైరస్ గురించి ఎక్కడికక్కడ ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తున్న గ్రామ వాలంటీర్లు చాలా వరకు ఇటువంటి సమయంలో రాష్ట్రంలో చాలా మంది ప్రాణాలు పోకుండా తమ ప్రాణాలను అడ్డంపెట్టి పని చేస్తుంటే వారిపై ఎలాంటి కథనాలు ప్రసాదించడం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. అసలు రాజకీయాలకి చేయడం ఇటువంటి టైం లో సిగ్గుచేటు మీరు అసలు మారారు అంటూ సదరు మీడియా ఛానల్ పై మండిపడుతున్నారు ఏపీ ప్రజలు.

Read more RELATED
Recommended to you

Latest news