అనంతలో భారీ విషాదం…!

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఆక్సీజన్ కొరత ఆందోళన కలిగిస్తుంది. వరుసగా మూడోరోజు ఆక్సిజన్‌ అందక ప్రాణ నష్టం అనంతపురంలో భయపెడుతుంది. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయారు. మధ్యాహ్నమే రావాల్సిన ఆక్సిజన్‌ ట్యాంకర్‌ రాత్రి ఏడు గంటలకు చేరుకున్న నేపధ్యంలో ప్రాణాలు కోల్పోయారు. ఈలోపే ఆక్సిజన్ ప్లాంటులో ప్రాణవాయువు ఖాళీ అయింది.

నలుగురు మరణించారని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి వివరించారు. కరోనా బాధితుల మరణాలపై జిల్లా యంత్రాంగం స్పందించడం లేదు. కోవిడ్ బాధితుల మరణాలపై మీడియాతో మాట్లాడకుండా జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు వెళ్ళిపోయారు. క్యాన్సర్ ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరాలో లోపాల విషయమై క్యాన్సర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ భాస్కర్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసారు. ఆక్సిజన్ ప్లాంట్ నిర్వాహకులు వారాశి ఏజెన్సీ కి కూడా మీ కాంట్రాక్ట్ ను ఎందుకు రద్దు చేయకూడదు అని షోకాజ్ నోటీసులు జారీ చేసారు.