మహిళలకి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్…!

ఏపీ ప్రభుత్వం మహిళలకి త్వరలో గుడ్ న్యూస్ చెప్పనుంది. దీనితో మహిళలకి మంచి ప్రయోజనం ఉంటుంది. ఇక దీనికి సంబంధించి పూర్తిగా చూస్తే… వైఎస్ఆర్ చేయూత స్కీమ్ కింద అర్హులైన లబ్ధిదారులకు డబ్బులు ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం రెడీ అవుతోంది.

దీని వలన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు మంచి బెనిఫిట్ ఉంటుంది. అయితే ఈ డబ్బులు వచ్చే నెల లో వచ్చేలా కనపడుతున్నాయి. వైఎస్ఆర్ చేయూత స్కీమ్ కింద మహిళల బ్యాంక్ అకౌంట్ల లోకి రూ.18,750 వస్తాయి.

ఈ కష్ట కాలం లో ఈ డబ్బులు వస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికెట్‌ను తీసుకుని ఎవరైనా కొత్తగా వైఎస్ఆర్ చేయూత స్కీమ్‌లో చేరచ్చు. బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు నెంబర్ లింక్ చేసుకుని ఉండాలి.

ఇది ఇలా ఉండగా మే 13న ఈ డబ్బులు అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లోకి రానున్నాయి. అదే విధంగా త్వరలో పీఎం కిసాన్ స్కీమ్ మోదీ ప్రభుత్వం కూడా రూ.2 వేల రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయొచ్చు. ఈ డబ్బులు కనుక ఈ సమయం లో పడితే చాల ప్రయోజనకరంగా ఉంటుంది