బిగ్ బ్రేకింగ్: హైదరాబాద్ జూలో సింహాలకు కరోనా నిర్ధారణ

హైదరాబాద్ జూ లో 8 సింహాలకు కరోనా లక్షణాలు రావడం ఆ తర్వాత వాటికి కరోనా పరిక్షలు నిర్వహించడం దేశ వ్యాప్తంగా సంచలనం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో వాటి పరిక్షా ఫలితాలు కాసేపటి క్రితం వెల్లడించారు. 8 సింహాలకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని అధికారులు వెల్లడించారు. దేశంలో మొదటిసారి జంతువులకు కరోనా సోకింది అని అధికారులు తెలిపారు.

దీనికి సంబంధించి కేంద్ర పర్యాటక శాఖ ఆరా తీసింది. కేంద్రానికి నివేదిక కూడా అధికారులు పంపించారు. ఇక సింహాలకు మెరుగైన వైద్యం అందించడానికి చర్యలు చేపట్టారు. జూ లో మిగిలిన సింహాలతో పాటుగా వాటికి సమీపంలో ఉండే జంతువులకు కూడా పరిక్షలు నిర్వహించే అవకాశం ఉంది. మిగిలిన జంతువులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.