భాగ్యనగరం మీద కరోనా ప్రభావం ఏ స్థాయిలో ఉందంటే…!

-

ఇండియా సిలికాన్ వ్యాలీగా పేరున్న హైదరాబాద్ లో ఇప్పుడు కరోనా కేసులు చాలా వేగంగా నమోదు కావడం ఇప్పుడు అక్కడి ప్రజలను భయపెడుతుంది. కరోన ప్రభావం ఇప్పుడు హైదరాబాద్ మీద ఎక్కువగా ఉంది. అగ్ర నగరాలను దేశ వ్యాప్తంగా కరోనా టార్గెట్ చేసింది. ఢిల్లీ, చెన్నై, ముంబై ఇప్పటికే ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పుడు ఆ బాటలోనే తెలంగాణా రాజధాని హైదరాబాద్ ఉండటం ఆందోళన కలిగిస్తున్న అంశం.

కరోనా హైదరాబాద్ మీద పగ పట్టిందా అనే విధంగా కేసులు నమోదు అవుతున్నాయి. తెలంగాణా సర్కార్ ప్రతీ నిత్యం కంటి మీద కునుకు లేకుండా ప్రయత్నాలు చేస్తున్నా పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. కేసీఆర్ కూడా హైదరాబాద్ విషయంలో అధికారులకు సూచనలు చేసారు. ఇప్పటి వరకు హైదరాబాద్‌ జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 182గా ఉంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో మరో 70 మందికి కరోనా సోకింది.

హైదరాబాద్ లో కంటైన్మెంట్‌ కేంద్రాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 246 కేంద్రాలుండగా.. హైదరాబాద్‌లోనే 126 ఉన్నాయి అంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ నెల 2న కేవలం 49 కేసులు ఉన్నాయి హైదరాబాద్ లో. పది రోజుల్లో అక్కడ 136 కేసులు నమోదు అయ్యాయి అంటే తీవ్రత ఏ విధంగా ఉందో అర్ధమవుతుంది. దీనికి మర్కాజ్ యాత్రకు వెళ్లి వచ్చిన వారె కాదు… విదేశాల నుంచి వచ్చిన వారు కూడా కారణమని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news