కోతలు మొదలయ్యాయ్‌… ఉద్యోగాలు పీకేస్తున్నారు… రోడ్డున పడుతున్నఉద్యోగులు..

-

కరోనా వ్యాప్తి ‘ లే ఆఫ్ ‘ ల దిశగా ప్రపంచాన్ని తరుముతోంది. ప్రతీ నిత్యం బిజీ గా ఉండే ప్రతీ కంపెనీ ఇప్పుడు తమ తమ ఉద్యోగులని ఎలా పక్కకి తప్పించాలో ఆలోచించడం లో నిమగ్నం అయ్యి ఉన్నాయి. సాఫ్ట్ వేర్ కంపెనీ ల దగ్గర నుంచి చిల్లర షాప్ ల వరకూ అందరి పరిస్థితి ఇలాగే ఉంది. కరోనా మహమ్మారి దెబ్బకి రాత్రికి రాత్రి ఉద్యోగాలు ఊడిపోయి రోడ్ల మీద పడుతున్నవారి సంఖ్య పెరిగిపోతోంది. ప్రస్తుతం ‘ దీ క్వింట్ ‘ అనే ప్రఖ్యాత మీడియా సంస్థ లే ఆఫ్ ల దిశగా సాగుతోంది. దాదాపు 45 మంది ఎంప్లాయీస్ ని ఈ కంపెనీ నుంచి పక్కకి తొలగించారు. నేరుగా తీసేయకుండా కొన్నాళ్లు సెలవు మీద వెళ్ళమని, ఆ సెలవు కాలాని డబ్బులు ఇవ్వలేము అని తెగేసి చెప్పారు.

ఈ నలభై ఐదు మంది ఉద్యోగస్తులలో జర్నలిజం అవార్డులు సైతం గెలుచుకున్న ప్రముఖులు ఉన్నారు. వారితో పాటు కాపీ ఎడిటర్ లు , బ్యూరో చీఫ్ , ప్రొడక్షన్ స్టాఫ్ మరియూ చాలా వరకూ టెక్నికల్ బృందం ఈ లిస్ట్ లో కనిపిస్తారు. ఆయా డిపార్ట్ మెంట్ హెడ్ లు వారికి చెల్లు చీటీలు అందించారు,. 200 మంది ఉద్యోగస్తులు ఉన్న quint సంస్థ ప్రస్తుతం 45 మందిని తొలగించింది. ఏప్రిల్ 15 నుంచీ ఈ సెలవులు మొదలు అవుతాయి. ” ఇండియా లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి .. వాటి పర్యవసానాలు ” అంటూ కంపెనీ వీరందరికీ ఒక ఈమెయిల్ పంపించారు. ఆర్ధిక స్తంబన , మహమ్మారి తీసుకొచ్చిన పరిస్థితి , రాబోయే రోజుల్లో రెవెన్యూ ఎలా ఉండబోతోంది .. ఇలా అనేక విషయాలు ఈ మెయిల్ లో మెన్షన్ చేశారు.

” నాలుగు ఐదు నెలలు ఇదే కొనసాగచ్చు ” అని అందులో రాసుకొచ్చారు. ” మిమ్మల్ని తీయడం మాకు సమ్మతం లేని పని .. కానీ తప్పడం లేదు .. మీ PF లూ వగైరా ఒక్కసారి క్లియర్ చేసుకోండీ ” అనే మెసేజ్ తో ఆ ఈ మెయిల్ ముగిసింది. డిజిటల్ మీడియం లో కరోనా దెబ్బకి ఆర్ధిక ఇబ్బందుల్లో పడిన మొట్టమొదటి సంస్థ క్వింట్ అనే చెప్పాలి. రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితి వస్తుందో చూడాలి.

టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా కూడా ఇదే దారిలో తమ ఉద్యోగులను తీసేందుకు రెడీ అయ్యింది. సండే మ్యాగజైన్‌ టీమ్ మెత్తాన్ని ఉద్యోగం నుండి తీసేస్తున్నట్లు తెలుస్తుంది.‌  దశాబ్దాలనుండి తమ సంస్థమీద ప్రేమతో ఉద్యోగం చేశామని అందులో చేశామాని 245 సంవత్సరాల తరువాత ఇలా తమను జాబ్‌ వదిలేయమనడం ఆశ్చర్యంగా ఉందని సీనియర్‌ జర్నలిస్ట్‌ నోనా వాలియా తన ఫేస్‌ బుక్‌ ద్వారా తన బాధను వ్యక్తం చేసింది.

ఇదే అదనుగా మిగిలిన మీడియాలు కూడా తమ ఉద్యోగులకు ఉద్వాసన పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. దశాబ్దాల తరబడి తక్కువ జీతానికి (మీడియాలో ఇచ్చేది చాలా తక్కువ అది ఇంగ్లీష్‌ అయినా మరే ఇతర బాష పత్రిక అయినా) పని  చేసినందుకు చాలామంది బాధ పడేరోజు చాలా దగ్గర్లోనే ఉందనేది నిజం..

source : www.newslaundry.com

Read more RELATED
Recommended to you

Latest news