ప్రజలకు ఇప్పుడు ఆర్ధిక కష్టాలు తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆర్ధికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఇళ్ళ నుంచి బయటకు వెళ్ళే అవకాశం లేదు కాబట్టి ఆదాయం కూడా లేదు. దీనితో అప్పుల బాట పడుతున్నారు జనాలు. అప్పులు తీసుకుని కుటుంబాలను నెట్టుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీనితో ఇప్పుడు ప్రభుత్వాలు బ్యాంకులు ప్రజలకు తమ వంతు సహకారం చెయ్యాలి అని భావిస్తున్నారు.
ఇప్పుడు బ్యాంకు లు జనాలకు ఒక ఆఫర్ ఇవ్వాలి అని భావిస్తున్నాయి. బ్యాంకు సర్వీసులు ఇప్పుడు పూర్తిగా నడవడం లేదు. ఐటి ఉద్యోగులు సహా బాగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా వారికి రుణాలు ఇవ్వాలి అని భావిస్తున్నాయి బ్యాంకులు. 10 వేలు జీతం ఉండే వారికి 30 వేలు ఋణం ఇవ్వాలని, ఇందుకోసం ఆన్లైన్ లోనే ఒక కొత్త సాఫ్ట్ వేర్ ని అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాయి.
లేదా ఒక యాప్ ని తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నారు. లక్ష రూపాయలు జీతం వచ్చే వారికి 2 నుంచి 3 లక్షల వరకు రుణ౦ ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. క్రెడిట్ కార్డు ఉన్న వాళ్లకు… లిమిట్ పెంచే యోచనలో ఉన్నారు. ఇక లోన్స్ తీసుకున్న వాళ్ళ ఖాతాల్లో అదనంగా వాళ్ళ జీతం ఆధారంగా నగదు జమ చెయ్యాలని చూస్తున్నారు. విద్యా రుణాలు తీసుకుని కడుతున్న ఉద్యోగులకు కూడా ఈ సదుపాయం కల్పించే యోచనలో ఉన్నారు. అన్ని రుణాలకు… రుణాలను ఆధారంగా చేసుకుని అదనపు రుణాలు ఇచ్చే యోచనలో ఉన్నారు.