ఆ గ్రూపు రక్తం వారికి ఎక్కువగా కరోనా సోకుతుంది…!

-

కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం ప్రాణ భయంతో వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. చిగురుటాకులా కరోనా ప్రపంచాన్ని వణికిస్తుంది. ఎంత అప్రమత్తంగా ఉన్నా సరే చాపకుండా నీరులా కరోనా వైరస్ విస్తరిస్తుంది. ఇదిలా ఉంటే కరోనా వైరస్ సోకే వారి విషయంలో ఇప్పుడు పరిక్షలు ముమ్మరం చేసారు శాస్త్రవేత్తలు. ఈ వ్యాధికి ఎలా అయినా సరే వ్యాక్సిన్ ని కనుగొనే పనిలో ఉన్నారు.

గ్రూప్ ఎ రక్తం ఎవరికైతే ఉంటుందో వారికి కరోనా సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని గుర్తించారు. వారిలోనే ఎక్కువ మంది మరణించే అవకాశం కూడా ఉందని తేల్చారు. గ్రూప్ ఒ రక్తం ఉన్నవారు 25 శాతం వరకే మరణించే ప్రమాదం ఉంటుందని పరిశోధనల్లో వెల్లడైంది. వుహాన్‌లోని జనాభాలో 32 శాతం మంది టైప్ ఒ రక్తం ఉన్నవారే కావడం గమనార్హం. 11మిలియన్ జనాభా ఉన్న వుహాన్ నగరంలో ఆరోగ్యవంతుల్లో 34 శాతం మందికి టైప్ ఎ రక్తం ఉంది.

టైప్ ఎ రక్తం ఉన్నంత మాత్రాన నూటికి నూరు శాతం వైరస్ సంక్రమిస్తుందని అఆందోళన చెందవలసిన పని లేదని అంటున్నారు. ఎ గ్రూపు రక్తం కాని వారి కన్నా ఎ గ్రూపు రక్తం ఉన్న వారిలో రిస్కు చాలా ఎక్కువని అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఊహాన్ నగర౦ లో కరోనా వైరస్ వ్యాప్తి భారీగా తగ్గింది. అక్కడ ఒక్క కేసు కూడా నమోదు కావడం లేదు. మరణాలు కూడా తగ్గాయి.

Read more RELATED
Recommended to you

Latest news