ప్రస్తుతం
కరోనా శరవేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కరోనా వైరస్ ను అంతం చేసే విధంగా మాస్క్ లను అభివృద్ధి చేయడం అంతేకాకుండా… మౌత్ వాష్ కరోనా వైరస్ పై ఏ మేరకు ప్రభావం చూపుతుంది అనేదానిపై కూడా ఎన్నో అధ్యయనాలు జరుగుతున్నాయి అనే విషయం తెలిసిందే. ఇటీవల యు కె కార్డిఫ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మౌత్ వాష్ కరోనా వైరస్ తో ఏ మేరకు ప్రభావం చూపుతుంది అనే దానిపై పరిశోధనలు జరిపి కీలక విషయాలను వెల్లడించారు.
0.07 పర్సెంట్ సేటిపేరిడినం క్లోరైడ్ రసాయనం ఉన్న ఏ మౌత్ వాష్ అయినా సరే… 30 సెకండ్ల వ్యవధిలోనే నోట్లో ఉన్న వైరస్ ను అంతం చేయగలుగుతుంది అంటూ శాస్త్రవేత్తలు గుర్తించినట్లు తెలిపారు, 12 వారాల పాటు జరిగిన అధ్యయనంలో ఈ ఆసక్తికర విషయాలు బయటపడినట్లు యుకెకు చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు.