మనుషులకు ఆ విషయాలను గుర్తు చేస్తున్న రోబో..!

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రజలందరికీ కరోనా వైరస్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో అన్లాక్ మార్గదర్శకాలు కొనసాగుతున్న నేపథ్యంలో కొన్ని కొన్ని ప్రాంతాలలో ఏకంగా మనుషుల ద్వారా కాకుండా రోబోల ద్వారా ప్రజలందరిలో కరోనా వైరస్ పై అవగాహన కల్పిస్తూ నిబంధనలను గుర్తుచేస్తున్న ఘటనలు ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే.

జపాన్ లో కూడా ఇలాంటి వినూత్న ఆలోచన చేసిన శాస్త్రవేత్తలు ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు మాల్స్ లో రోబోలతో అందరు కస్టమర్లకు కరోనా నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నారు. అడ్వాన్స్ కమ్యూనికేషన్స్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ ఇంటర్నేషనల్ అభివృద్ధి చేసిన రోబోలను జపాన్లోని మాల్స్ లో ఉంచుతూ అక్కడి వారందరికీ తప్పనిసరిగా అవగాహన కల్పిస్తున్నారు. రోబోలు ఎంతగానో ఉపయోగకరంగా ఉన్నాయని నిర్వాహకులు చెబుతున్నారు.