జిహెచ్ఎంసి ఎన్నికలు.. ప్రచారానికి కత్తర వేసిన ఎన్నికల సంఘం..!

జిహెచ్ఎంసి ఎన్నికల నగారా మోగింది. ఇటీవలే రాష్ట్ర ఎన్నికల కమిషన్ జిహెచ్ఎంసి ఎన్నికల తేదీలను ప్రకటించడంతో ప్రస్తుతం అభ్యర్థులు అందరూ ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఈ క్రమంలోనే ఓటర్ మహాశయులకు ఆకట్టుకునేందుకు అన్ని రకాల ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇక ఈ జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లో విజయం సాధించాలని అన్ని పార్టీలు ఎంతో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇటీవల రాష్ట్ర ఎన్నికల కమిషన్ కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని విధించిన ఆంక్షలు అభ్యర్థులందరికీ భారీ షాక్ ఇచ్చాయి అని చెప్పాలి.

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అభ్యర్థులు కాన్వాయ్ కేవలం రెండు వాహనాలకు మించి ఉండకూడదని అంతేకాకుండా భౌతిక దూరం పాటించాలని సూచించారు. అభ్యర్థుల వెంబడి భద్రతా సిబ్బంది మినహా ఐదుగురు మాత్రమే ఇంటింటి ప్రచారంలో పాల్గొనాలని సూచించారు. రోడ్ షోలకు అనుమతి లేదని.. ప్రచారంలో కూడా కరోనా నిబంధనలు పాటించాలని లేకపోతే చర్యలు తప్పవు అంటూ హెచ్చరించారు.