ఫ్యామిలీ మొత్తానికి కరోనా… తట్టుకోలేక మహిళ ఆత్మహత్య…!

ఢిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ (ఆర్‌జిఎస్‌ఎస్‌హెచ్) లో 52 ఏళ్ల కరోనా వైరస్ రోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం అయింది. ఆమె తాను చికిత్స తీసుకుంటున్న ఆసుపత్రి గది కిటికీలో నుంచి దూకినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేయగా… ఆమెను మంగళవారం సాయంత్రం ఆర్‌జిఎస్‌ఎస్‌హెచ్‌లో చేర్చినట్లు గుర్తించారు.

మహిళ డిప్రెషన్‌తో బాధపడుతోందని వైద్యులు జాతీయ మీడియాకు తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న మహిళ దిల్షాద్ కాలనీలో నివసిస్తున్న పద్మజగా గుర్తించారు. మహిళా కొడుకు, భర్త కూడా ఆసుపత్రిలో కరోనాతో చేరినట్లు ఆర్‌జిఎస్‌ఎస్‌హెచ్‌ సీనియర్ వైద్యుడు జాతీయ మీడియాకు వివరించారు. మృతదేహాన్ని జిటిబి ఆసుపత్రిలో ఉంచామని, దర్యాప్తు జరుగుతోందని పోలీసులు పేర్కొన్నారు. ఫ్యామిలీ మొత్తానికి కరోనా రావడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్నారు అని వైద్యులు వివరించారు.