గురుకులాల్లో కరోనా కల్లోలం…. మరో 19 మందికి కరోనా…

తెలంగాణ గురుకులాల్లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఇటీవల కాలంలో తెలంగాణ గురుకుల పాఠశాలతో పాటు.. వివిధ స్కూళ్లలో కరోనా వ్యాధి కలకలం రేపుతోంది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఇంద్రేశం గురుకుల పాఠశాలలో మరో 19 మందికి కరోనా సోకింది. మొత్తం 584 మందికి కరోనా టెస్టులు చేయగా.. 19 మందికి బాలికలకు కరోనా సోకినట్లు తేలింది. మూడు రోజుల వ్యవధిలో ఈ గురుకుల పాఠశాలలో 46 మందికి కరోనా సోకింది. వైరస్ తీవ్రత పెరగడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రల్లో భయాందోళనలు నెలకొన్నాయి. కొందరు విద్యార్థినులను వారి తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకెళుతున్నారు

ఇదిలా ఉంటే ఇటీవల తెలంగాణలో కొన్ని గురుకులాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో కరోనా బారిన పడుతున్నారు విద్యార్థులు. ఇటీవల సంగారెడ్డి జిల్లా ముత్తంగి, ఖమ్మం జిల్లా వైారా గురుకులాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. వ్యాధి బారిన పడిన విద్యార్థులను ఐసోలేషన్ కు తరలించగా… వీరితో సన్నిహితంగా ఉన్న వారిని క్వారంటైన్ పంపుతున్నారు. వీరితో సన్నిహితంగా ఉన్న విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.