కాంగ్రెస్ నేతలంతా ప్రశాంత్ కిషోర్లే : జగ్గారెడ్డి రెడ్డి

-

కాంగ్రెస్ నేతలంతా ప్రశాంత్ కిషోర్లే.. మా పార్టీకి ప్రశాంత్ కిషోర్ అక్కరే లేదని పేర్కొన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి రెడ్డి. గాంధీ భవన్ కి వస్తే తెలుస్తుంది ఇక్కడ ఎంత మంది ప్రశాంత్ కిషోర్ లు ఉన్నారో అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మేము ఒక్కొక్కరం ఒక్కో ప్రశాంత్ కిషోర్ లమని..
తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్..టిఆర్ఎస్ మాత్రమేనని పేర్కొన్నారు.

బీజేపీ ది థర్డ్ ప్లేస్ అని.. Bsp కూడా తెలంగాణలో మేమే అధికారంలోకి వస్తాం అని చెప్తుందని ఎద్దేవా చేశారు. తెలంగాణ లో టిఆర్ఎస్ తో దోస్తానా లేదు.. కొట్లాటేనని చెప్పారు. ఎవరితో కలిసి పని చేయాలి అనేది..ఢిల్లీ లోనే నిర్ణయం తీసుకుంటారని.. సోనియా గాంధీ.. రాహుల్ నిర్ణయమే ఫైనల్ అని తెలిచి చెప్పారు. స్థానికంగా నిర్ణయాలు ఉండవని.. 230 ఓట్లున్న మమ్మల్ని చూసి టిఆర్ఎస్ భయపడుతుందన్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ బెదిరించిన ఆడియో వచ్చింది.. ఎన్నికల కమిషన్ ఏం చేసిందని నిలదీశారు. ఎన్నికల కమిషన్..అధికార పార్టీ దే కదా…..? అని ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news