సంక్షేమమే పరమావధిగా ఏపీలో జగన్ పరిపాలన హాయిగా సాగిపోతుందని అనుకుంటున్న సమయంలో.. కరోనా రూపంలో ఒక సమస్య వచ్చిపడింది. ఆరోగ్యానికి సంబందించినది అయిన ఆ సమస్య… రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని అంటున్నారు. దీంతో కరోనా సంగతి అటో ఇటో తేల్చాలని ఫిక్సయిన జగన్… 90 రోజుల్లో ఇంటింటికీ తిరిగి కరోనా టెస్టులు చేయాలని, అక్కడే మందులు ఇవ్వాలని సూచించిన సంగతి తెలిసిందే. ఆ సంగతులు అలా ఉంటే… తాజాగా సీఎం కార్యాలయంలో లోనే ఒక అధికారికి కరోనా పాజిటివ్ వచ్చిందన్న వార్త ఇప్పుడు ఆంధ్రులందరినీ కలవరపెడుతుంది!
ముఖ్యమంత్రి కార్యాలయంలో పని చేసే ఓ అధికారికి కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని.. ఆయనతోపాటు వివిధ శాఖల్లో పనిచేసే 15 మందికి కూడా వైరస్ సోకిందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో… సీఎం ఆఫీసులో పాజిటివ్ వచ్చిన ఆ అధికారి, ముఖ్యమంత్రి జగన్ ని రెగ్యులర్ గా కలుస్తుంటారని, సీఎంతో సంబంధాలను కలిగి ఉన్న అధికారి అని అంటున్నారు! దీంతో వైకాపా శ్రేణులతో పాటు ఏపీ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతుంది!!
అయితే… దీనికి సంబందించిన అన్ని ప్రికాషన్స్ జగన్ ముందుగా తీసుకుంటున్నారని, శానిటైజర్ ను రెగ్యులర్ గా వాడుతున్నారని, చూడాల్సిన ఫైల్స్ కూడా శానిటైజ్ అయ్యే వస్తున్నాయని.. కాబట్టి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదనే వార్తలు కూడా వస్తున్నాయి!
కాగా ఇప్పటికే విజయనగరం జిల్లా శృంగవరపు కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాస రావు.. కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్.. మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు.. ఎమ్మెల్యే అన్నా రాంబాబు మనవడు కూడా వైరస బారిన పడిన సంగతి తెలిసిందే. వీరితోపాటు ఇద్దరు మహిళా ఐఏఎస్ లతో కలిపి మొత్తం ఐదుగురు ఐఏఎస్ అధికారులకు పాజిటివ్ వచ్చిందని వార్తలొస్తున్న సంగతీ తెలిసిందే!