అమెరికాలో పెరుగుతున్న కరోనా.. బూస్టర్ టీకా తీసుకోవాలంటున్న ప్రభుత్వం.

-

కరోనా విజృంభణ ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. కొత్త కొత్త రూపాంతరాలను వ్యాక్సిన్ సామర్థ్యాన్నే ప్రశ్నించేలా ఉంటున్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా సెకండ్ వేవ్ సృష్టించిన భీభత్సం అంతా ఇంతా కాదు. భారతదేశంలో మూడవ వేవ్ పట్ల ప్రజలంతా భయంతో ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా అమెరికాలో కరోనా కేసులు పెరుగుతున్నట్టు సమాచారం. వ్యాక్సిన్ తీసుకున్నవారిలో కూడా కరోనా సోకడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి ముందుకు వచ్చింది.

వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో కరోనా వ్యాపించే అవకాశం ఉన్నందున బూస్టర్ టీకా తీసుకోవాలని కోరింది. ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లు తీసుకుని చాలా రోజులు అవుతున్నా లేదా వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ రోగనిరోధక శక్తిలో పెద్దగా మార్పు కనిపించనట్టయితే బూస్టర్ టీకాను తీసుకోవాలని తెలిపింది. కరోనా మరో వేవ్ రాకుండా ఉండాలంటే ఇదొక్కటే మార్గమని సూచించింది.

Read more RELATED
Recommended to you

Latest news