బ్రేకింగ్ : తమిళ సినీ నటుడు వడివేలుకు కరోనా పాజిటివ్.. ఆస్ప‌త్రిలో చేరిక‌

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచ దేశాల‌ను అతాల‌కుత‌లం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈ వైర‌స్ భారీన ప‌డి చాలా మంది ప్ర‌ముఖులు మ‌ర‌ణించ‌గా.. మ‌రికొంత మంది బ‌య‌ట ప‌డ్డారు. అయితే.. ఈ వైర‌స్ ఎక్కువ‌గా.. చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన వారినే క‌బ‌లించి వేసింది. అయితే.. తాజాగా.. త‌మిళ స్టార్ న‌టుడు, క‌మెడియ‌న్ వ‌డివేలుకు క‌రోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది. లండన్ తో సినిమా షూటింగ్ ముగించుకుని మూడు రోజుల ముందు ఇండియాకు వడివేలు వచ్చారు.

అయితే.. లండ‌న్ నుంచి వ‌చ్చిన ఆ మూడు రోజుల నుంచి… వ‌డివేలు ఆరోగ్య‌వం కాస్త అస్వ‌స్థ‌త‌కు గురైంది. దీంతో ఆయ‌న‌కు ఇవాళ క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేశారు. ఈ ప‌రీక్ష‌ల్లో… క‌మెడియ‌న్ వ‌డివేలు కు క‌రోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది.దీంతో ఆయ‌న‌ను పోరూర్ లోని ప్రైవేట్ హాస్పటల్‌లో చికిత్స నిమిత్తం అడ్మిట్ చేశారు. అంతేకాదు.. ఆయ‌న లండ‌న్ నుంచి రావ‌డంతో… ఒమిక్రాన్ ప‌రీక్ష‌లు చేస్తున్నారు. రేపు ఆ రిపోర్టులు వ‌చ్చే ఛాన్స్ ఉంది.