ఫుడ్ ప్యాకెట్లపై కరోనా.. చైనాలో మరో తలనొప్పి..?

-

చైనాలో ప్రస్తుతం కరోనా వైరస్ పూర్తిగా తగ్గుముఖం పడుతున్న విషయం తెలిసిందే. కానీ అక్కడి ప్రజలను మాత్రం ఏదో ఒక విధంగా కరోనా వైరస్ భయం మాత్రం వేధిస్తూనే ఉంది. ఇటీవలే ఫుడ్ ప్యాకెట్లపై కరోనా వైరస్ ను అధికారులు గుర్తించడం కలకలం సృష్టించింది. చైనా తూర్పు నగరమైన కింగ్ డావో లోని ఆరోగ్య అధికారులు… సీఫుడ్ దిగుమతిదారులు నిల్వ ఉంచిన కొన్ని ఫుడ్ ప్యాకెట్లపై ఉన్న నమూనాలను సేకరించి కరోనా నిర్ధారిత పరీక్షలు నిర్వహించారు.

దీంతో వచ్చిన ఫలితాలు చూసి అధికారులు షాక్ అయ్యారు. ఫుడ్ ప్యాకెట్లపై కరోనా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఇక తనిఖిలు వేగవంతం చేశారు అధికారులు. అంతేకాదు కరోనా వైరస్ బయట పడిన నేపథ్యంలో మాంసం దిగుమతి చేసుకోవడాన్ని నిషేధించింది ప్రభుత్వం. అయితే ఫుడ్ ప్యాకెట్లపై కరోనా వైరస్ ఆనవాళ్లు ఉన్నప్పటికీ.. దిగుమతుల కార్యక్రమాల్లో పాల్గొన్న ఎవరికీ పాజిటివ్ మాత్రం రాలేదు అంటూ చెప్పుకొచ్చారు అధికారులు. అందుకే ఎలాంటి ఆహార పదార్థం అయిన నాలుగు వారాలు నిల్వ ఉంచిన తర్వాత విక్రయించాలి అంటూ సరి కొత్త నిబంధన విధించింది అక్కడి ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news