బాలుకు తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖుల సంతాపం..!

-

గాన గాంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం మృతిప‌ట్ల తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం వ్య‌క్తం చేశారు. బాలు కుటుంబ స‌భ్యుల‌కు కేసీఆర్ ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. బాలు లేని లోటు ఎప్ప‌టికీ పూడ్చ‌లేనిది అని పేర్కొన్నారు. ఎన్నో సుమ‌ధుర గేయాలు పాడి ప్ర‌జ‌ల అభిమానం సంపాదించారు అని గుర్తు చేశారు. గాయ‌కుడిగా, న‌టుడిగా, సంగీత ద‌ర్శ‌కుడిగా సేవ‌లు అందించార‌ని సీఎం పేర్కొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మహా గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూశారన్న వార్తతో తాను దిగ్భ్రాంతికి గురయ్యానని వెల్లడించారు. 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడి సంగీత ప్రియుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని కీర్తించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. ‘రిప్ ఎస్పీబీ’ అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టారు.

విరియహు పాటు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సుప్రసిద్ధ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూశారన్న వార్త తెలియగానే తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కోట్లాది హృదయాలు వేడుకున్నా విధి కరుణించలేదు అంటూ ఆవేదన వెలిబుచ్చారు. రేపో మాపో ఆసుపత్రి నుంచి ఆరోగ్యంగా తిరిగి వస్తారనుకున్న బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరన్న వార్త వినడానికే బాధాకరంగా ఉంది అంటూ చంద్రబాబు ట్విట్టర్ లో స్పందించారు.

Read more RELATED
Recommended to you

Latest news