జగిత్యాలలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేసారు. కేంద్ర వ్యవసాయ బిల్లుకు నిరసనగా జగిత్యాల జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ… కేంద్రం ప్రవేశ పెట్టిన వ్యవసాయ బిల్లు కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాసేలా ఉన్నది అని ఆరోపించారు. పార్లమెంట్ సమావేశాల్లో వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా టిఆర్ఎస్ ఎంపీలు వాకౌట్ చేయలేదని మండిపడ్డారు.
కేవలం సభ నుంచి నిష్క్రమించారు అని అన్నారు. దీన్ని బట్టి చూస్తే …టిఆర్ఎస్ ఎంపీలు థర్డ్ జెండర్ గా మారారు అంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్య చేసారు. తెలంగాణ ప్రభుత్వం నియంత్రిత సాగు పేరుతో నిర్బంధ సాగు అమలు చేసింది అని మండిపడ్డారు. కాగా కేంద్రంపై తెరాస ఎంపీలు విమర్శలు చేస్తున్నారు.