ఏలకులకు మార్కెట్ లో ఎంత డిమాండ్ ఉందో మనందరికి తెలుసు. నాలుగు యాలుకలే రూ. 20 పైనే తీసుకుంటారు. ఇక కేజీ అంటే.. 3000- 4000 వరకూ ఉంది. అంత ఖరీదైన పంటను పండిస్తే.. ఆదాయం లక్షల్లోనే వస్తుంది కదా.. మన తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఎప్పుడూ పండించేవి తప్ప కొత్తవాటిని ట్రై చేయడానికి పెద్దగా ఇష్టపడరు. ఎందుకు రిస్క్ అని.. భిన్నంగా ప్రయత్నించినప్పుడే మంచి లాభాలు వస్తాయి. తెలంగాణలో పుట్టగొడుగలు వ్యాపారం చేస్తూ.. ఓ యువరైతు సంవత్సరానికి 40లక్షల ఆదాయం గడిస్తున్నాడు. రుద్రాక్షను కూడా తెలంగాణ గడ్డపై పండిస్తున్నారు. పంటపై పూర్తి అవగాహన, నేలను అనుగుణంగా మార్చినప్పుడు సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు. ఈరోజు మనం ఏలకుల సాగుకు అనువైన నేల, పండించడం ఎలానో చూద్దాం.
ఏలకుల మొక్క ఎలా ఉంటందంటే..
ఏలకుల మొక్క 1 నుండి 2 అడుగుల పొడవు పెరుగుతుంది. ఈ మొక్క కాండం 1 నుండి 2 మీటర్ల పొడవు ఉంటుంది. ఇక ఆకులు.. 30 నుండి 60 సెం.మీ పొడవు, వెడల్పు 5 నుండి 9 సెం.మీ. ఉంటుంది.
ఏలకుల్లో రకాలు
ఏలకులు రెండు రకాలు ఉంటాయి.. ఒకటి ఆకుపచ్చ ఏలకులు మరియు మరొకటి గోధుమ ఏలకులు. గోధుమ ఏలకులు భారతీయ వంటకాలలో విపరీతంగా వాడతారు. ఇది స్పైసీ ఫుడ్‌ను మరింత రుచికరమైనదిగా చేయడానికి ఉపయోగిస్తారు. మరోవైపు, నోరు శుద్ధి చేయడానికి పాన్‌లో చిన్న ఏలకులను ఉపయోగిస్తారు. దీనితో పాటు పాన్ మసాలాలో కూడా ఉపయోగిస్తారు. దీనిని టీ తయారీలో కూడా ఉపయోగిస్తారు. దీంతో మార్కెట్‌లో రెండు రకాల ఏలకులకు మాంచి డిమాండ్ ఉంది.
సాగుకు నేల వాతావరణం
ఎర్రమట్టి నేల ఏలకుల సాగుకు మంచిది. ఇది కాకుండా ఎరువులు ఉపయోగించి ఇతర రకాల నేలల్లో సులభంగా పెంచవచ్చు. దీని సాగు కోసం భూమి యొక్క pH విలువ 5 నుండి 7.5 వరకు ఉండాలి. మరోవైపు, ఉష్ణమండల వాతావరణం ఏలకుల సాగుకు ఉత్తమమైనది. దీని సాగుకు 10° నుండి 35°C ఉష్ణోగ్రత అవసరం.
ఏలకులు నాటడానికి ముందు పొలాన్ని రోటవేటర్‌తో ఒకసారి దున్నాలి. ఒక అడుగు నుండి 2 అడుగుల దూరంలో మంచం వేయాలి. అదే సమయంలో గుంతల్లో ఏలకుల మొక్కలు నాటేందుకు 2 నుంచి 3 అడుగుల దూరం పాటించి మొక్కను నాటాలి. తవ్విన గుంతలో ఆవు పేడ, ఎరువులు మంచి పరిమాణంలో కలపాలి.
ఆసక్తి ఉండి ఈ అంశం పై పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే.. సంబంధిత నిపుణులు లేదా.. బ్రౌజ్ చేసి విషయ పరిజ్ఞానం పొందాక.. సాధ్యాసాధ్యాలు చూసుకుని స్టెప్ తీసుకోవచ్చు.