కరోనా కాలం.. రోగనిరోధక శక్తిని పెంచే ఐస్‌క్రీంలు.. !

-

ప్రస్తుత రోజుల్లో కరోనా వైరస్ వల్ల ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్దితులు నెలకొన్నాయి.. ఈ సమయంలో రోగనిరోధక శక్తి ఉన్న వారికి కరోనా వల్ల కొంత ముప్పు తప్పినట్లే.. కానీ మిగతా వారి పరిస్దితి దారుణం.. ప్రాణాలను గాజుబొమ్మలుగా కాపాడుకోవలసిన గడ్డురోజుల్లో జీవిస్తున్నారు.. ఇక బయటకు వెళ్లినప్పుడు భయం భయంగా ఉండవలసి వస్తుంది.. ఇలాంటి కరోనా కాలంలో ప్రజలు ఐస్‌క్రీమ్ ల ఊసు ఎప్పుడో మరిచిపోయారు.. కానీ ఆ కంపెనీలు వదిలిపెడతాయా.. అందుకే ఇప్పుడు సరికొత్త ఐస్‌క్రీమ్ ను ప్రజలకు పరిచయం చేస్తున్నాయి..

ఇకపోతే ప్రస్తుతం కరోనా ప్రభావం చూపనిదంటూ ఏదైనా ఉందా.. దాదాపుగా అన్నీ రంగాలను కరోనా శాసిస్తుంది.. ఇందుకు ఐస్‌క్రీమ్‌లు మినహాయింపు కాదు. అందుకే డెయిరీ డే సంస్థ భిన్నంగా ఆలోచించింది.. పిల్లలకు రోగనిరోధక శక్తిని పెంచే క్రమంలో కర్ణాటకలోని ఈ డెయిరీ డే సంస్థ రెండు రకాల ఐస్‌క్రీమ్‌లను విడుదల చేసింది. అందులో మొదటిది చ్యావాన్‌ప్రాష్ ఐస్‌క్రీమ్.

 

ఇది కొంచెం వగురుగా ఉన్నా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని చాలమంది పిల్లలు తినమంటూ మారం చేస్తుంటారు. డైరెక్ట్‌గా తినలేరు కాబట్టి ఐస్‌క్రీంలో వేసి తయారు చేశారు. దీంతోపాటు తేనె, ఖర్జూరం కూడా మిక్స్ చేసి ఐస్‌క్రీమ్ అందిస్తున్నారు. ఇకపోతే రెండో ఐస్‌క్రీమ్‌ను పసుపు, చింతపండు, తేనె కలిపి తయారుచేశారు. దీంతో రోగనిరోధక శక్తి పెరగుతుందని వారు చెబుతున్నారు.. కాగా దేశంలోనే మొదటిసారిగా ఈ తరహా ఐస్‌క్రీమ్‌లను మార్కెట్లోకి తెస్తున్నామని డెయిరీ సంస్ద అధికారులు వెల్లడించారు..

Read more RELATED
Recommended to you

Latest news