ఏపీ మంత్రి అవంతి శ్రీ‌నివాస్‌కు క‌రోనా పాజిటివ్

దేశ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ రాజ‌కీయ నాయకుల‌ను వ‌ణికిస్తుంది. ఇప్ప‌టికే వ‌రుస‌గా ప‌లు రాష్ట్రాల‌లో రాజ‌కీయ నాయ‌కులు క‌రోనా బారిన ప‌డ్డారు. కేంద్ర మంత్రులు, ముఖ్య మంత్రులు, రాష్ట్ర మంత్రులు అని తేడా లేకుండా అంద‌రికీ క‌రోనా సోకుతుంది. తాజా గా ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర మంత్రి అవంతి శ్రీ‌నివాస్ కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది. త‌నకు స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉండ‌టంతో క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష చేసుకున్నట్టు ఆయ‌న తెలిపారు.

ఈ ప‌రీక్ష‌లో ఆయ‌నకు క‌రోనా పాజిటివ్ అని తెలింద‌ని తెలిపారు. దీంతో త‌న సొంత ఇంట్లో నే ఐసోలేష‌న్ లో ఉన్నట్టు ఆయ‌న ప్ర‌క‌టించారు. అయితే త‌న‌ను ఇటీవ‌ల క‌లిసిన వారంద‌రూ క‌రోనా నిర్ధార‌ణ పరీక్ష‌లు చేసుకోవాల‌ని మంత్రి అవంతి శ్రీ‌నివాస్ కోరారు. అలాగే ల‌క్ష‌ణాలు ఉన్న వారు క్వారైంటెన్ లో ఉండాల‌ని విజ్ఞాప్తి చేశారు. అలాగే రాష్ట్ర ప్ర‌జ‌లు అంద‌రూ కూడా క‌రోనా, ఓమిక్రాన్ ప‌ట్ల జగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు. అంద‌రూ కూడా రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ ను తీసుకోవాల‌ని అన్నారు.