కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. భారత్ లో కేసులు తగ్గినట్టు అనిపిస్తున్నా మళ్ళీ పెరుగుతున్నాయి. ఇక సాధారణ ప్రజలతో పాటూ అధికారులు, ప్రజా ప్రతినిధులు సైతం కరోనా బారిన పడుతున్నారు. అలాగే ఈ మహమ్మారి సోకి ఇప్పటికే అనేకమంది మరణించగా మరికొందరు కోలుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
ఇప్పటికే చాలా మంది కేంద్ర మంత్రులు కూడా కరోనా బారిన పడ్డారు. తాజాగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమె హోం ఐసోలేషన్ లోకి వెళ్లి పోయారు. ఈ మేరకు ఆమె తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అలానే తనతో కాంటాక్ట్ అయిన వారందరూ వెంటనే కరోనా టెస్టులు నిర్వహించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. నాతో టచ్‌లోకి వచ్చిన వారందరూ వెంటనే కరోనా పరీక్షలు నిర్వహించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా అని అర్ధం వచ్చేలా స్మృతి ఇరానీ ట్వీట్ చేశారు.