కరోనా లాక్ డౌన్ లో విందు ఇచ్చి సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసాడు… ఇక అంతే…!

-

దేశం మొత్తం కూడా కరోనా వైరస్ దెబ్బకు నానా ఇబ్బందులు పడుతుంది. ఇప్పుడు ఎక్కడా కూడా ఈ కార్యక్రమాలు అసలు జరగడం లేదు. చిన్న చిన్న కార్యక్రమాల నుంచి పెద్ద పెద్ద కార్యక్రమాల వరకు అన్నీ కూడా రద్దు చేసుకున్నారు. లాక్ డౌన్ లో బయటకు వస్తే పోలీసులు ఒక రకంగా చెప్పాలి అంటే తాట తీసే పరిస్థితి ఉందనేది వాస్తవం. అందుకే చాలా మంది జాగ్రత్తగా ఉంటున్నారు.

కాని తమిళనాడు లోని ఒక వ్యక్తి మాత్రం భారీగా విందు ఇచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఓ పక్క దేశం మొత్తం కరోనా భయంతో గజగజలాడిపోతుంది. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ కొంతమందికి విందు ఏర్పాటు చేసాడు ఒక మహానుభావుడు. దీన్ని వీడియో తీసి, ‘కరోనా విందు’ అంటూ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఇందుకు భారీగా జనం కూడా వచ్చారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం తో తమిళనాడు పోలీసుల దృష్టికి వెళ్ళింది అది. దీనితో తమిళనాడు పోలీసులు ఆ వీడియో చూసి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని మీద కేసులు నమోదు చేసారు. తమిళనాడు లో కరోనా తీవ్రత చాలా అధికంగా ఉన్నా సరే అక్కడి ప్రజలు మాత్రం ఎవరి మాట వినే పరిస్థితి కనపడటం లేదు. చెప్పిన వాళ్ళను కూడా వెటకారం గా చూస్తున్నారు అక్కడి జనాలు.

Read more RELATED
Recommended to you

Latest news