ఇక మాస్క్ లేకపోతే పెట్రోల్ ఉండదు…!

-

ఇప్పుడు కరోనా వైరస్ దెబ్బకు ఎవరికి వారుగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కడా కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తమ వంతుగా ఎవరి సహకారం వాళ్ళు అందిస్తూ వస్తున్నారు. ప్రజలు ఎక్కడా కూడా కరోనా వలన ఇబ్బంది పడకూడదు అని భావిస్తూ చాలా వరకు కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. ప్రస్తుతం కరోనా వైరస్ నేపధ్యంలో మాస్క్ ని తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

మన దేశంలో ఇప్పుడు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మాస్క్ ని తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా పెట్రోల్ బ౦క్ లు కూడా కీలక నిర్ణయం తీసుకున్నాయి దేశంలోని పెట్రోల్ పంప్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పెట్రోల్ బంకుల్లో మాస్క్‌ని తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. వాహనదారులు మాస్క్ ధరించకుంటే వారికి పెట్రోలో, డీజిల్, గ్యాస్ నింపే ప్రసక్తే లేదని స్పష్టం చేసాయి.

మాస్క్ ధరించకపోవడం వల్ల వారితో పాటు పెట్రోల్ బంకుల్లో పనిచేసే సిబ్బందికి కూడా వైరస్ వ్యాప్తిచెందే ప్రమాదముందని భావిస్తూ తాము ఈ క్రమంలోనే ‘నో మాస్క్-నో పెట్రోల్’ నిబంధన తీసుకొచ్చామని ఆ వర్గాలు చెప్పాయి. దేశంలో ప్రస్తుతం మాస్క్ విషయంలో ప్రధాని నుంచి ముఖ్యమంత్రుల వరకు అందరూ అవగాహన కల్పిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news