ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో థర్డ్ వేవ్ దాదాపు ముగిసింది. ఈ మధ్య కాలంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి రోజు 50 లోపే కేసులు నమోదు అవుతున్నాయి. కాగ ఈ రోజు.. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య కొంత వరకు పెరిగింది. ఈ రోజు కరోనా వైరస్ బులిటెన్ ను కాసేపటి క్రితం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేశారు. ఈ కరోనా బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 28 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.
కాగ గురువారం రాష్ట్రంలో కేవలం 8 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. అంటే గురువారంతో పోలిస్తే.. ఈ రోజు 20 కేసులు పెరిగాయి. కాగ ఈ రోజు కూడా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మరణాలు నమోదు కాలేదు. అలాగే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో 77 మంది కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం కేవలం 202 కరోనా వైరస్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగ గడిచిన 24 గంటల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు.. 9,394 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.