IPL KKR vs PBKS : టాస్ నెగ్గిన కోల్‌క‌త్త‌.. మొద‌ట బ్యాటింగ్ చేయ‌నున్న‌ పంజాబ్

-

ఐపీఎల్ 2022 లో నేటి పోరుకు అంతా సిద్ధం అయింది. నేడు శ్రేయ‌స్ అయ్యార్ నేతృత్వంలోని కోల్ క‌త్త నైట్ రైడ‌ర్స్, మ‌యాంక్ అగ‌ర్వాల్ సార‌థ్యంలోని పంజాబ్ కింగ్స్ త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్ లో భాగంగా కీల‌క‌మైన టాస్ ను కోల్‌క‌త్త నైట్ రైడ‌ర్స్ నెగ్గింది. దీంతో శ్రేయ‌స్ అయ్యార్.. మొదట బౌలింగ్ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేయ‌నుంది.

అయితే కోల్‌క‌త్త ఇప్ప‌టికే రెండు మ్యాచ్ లు ఆడి.. నేడు మూడో మ్యాచ్ ఆడుతుంది. అందులో ఒక మ్యాచ్ మాత్ర‌మే విజ‌యం సాధించింది. అలాగే పంజాబ్ కింగ్స్ జ‌ట్టు… ఒక మ్యాచ్ ఆడి.. దాంట్లో గెలిచింది. కాగ ఈ మ్యాచ్ లో కూడా గెల‌వాల‌ని ఇరు జ‌ట్లు ప్రణాళిక‌లు సిద్ధం చేసుకుంటున్నాయి. కాగ ఈ మ్యాచ్ కోసం ఇరు తుది జ‌ట్లు ఇలా ఉన్నాయి.

పంజాబ్ కింగ్స్ తుది జ‌ట్టు :
మయాంక్ అగర్వాల్ ( కెప్టెన్ ), శిఖర్ ధావన్, లియామ్ లివింగ్ స్టోన్, భానుక రాజపక్స ( వికెట్ కీప‌ర్ ), షారుక్ ఖాన్, ఒడియన్ స్మిత్, రాజ్ బావా, అర్ష్‌దీప్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, కగిసో రబడ, రాహుల్ చాహర్

కోల్‌కతా నైట్ రైడర్స్ తుది జ‌ట్టు :
అజింక్యా రహానే, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా, శ్రేయాస్ అయ్యర్ ( కెప్టెన్ ), సామ్ బిల్లింగ్స్ ( వికెట్ కీప‌ర్ ), ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, టిమ్ సౌతీ, ఉమేష్ యాదవ్, శివమ్ మావి, వరుణ్ చకరవర్తి

Read more RELATED
Recommended to you

Latest news