తెలంగాణా వైద్య, ఆరోగ్య శాఖ మం త్రి ఈటల రాజేందర్ పేషీలో కరోనా కలకలం రేగింది. ఏకంగా ఆయన సిబ్బందిలోని ఏడుగురికి కరోనా పాజిటివ్ ని తేలింది. వీరిలో ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు పీఏలు, ముగ్గురు గన్ మెన్లు ఉన్నట్లు సమాచారం. దీంతో ముందస్తు చర్యగా మంత్రి ఈటల నిన్న హోం ఐసోలేషన్ కే పరిమితం అయ్యారు. అయితే ఆయనకు సిబ్బందితో పాటే పరీక్షలు చేసినా నెగటివ్ వచ్చింది.
అయితే మరో రెండ్రోజుల్లో మరోసారి పరీక్ష చేయించుకుంటానని మంత్రి చెబుతున్నారు. ఒకే సారి ఏడుగురికి కరోనా పాజిటివ్ అని తేలడంతో బీఆర్కే భవన్ లోని మంత్రి ఈటల పేషీని పూర్తిగా మూసేసి శానిటైజ్ చేశారు. అయితే మంత్రికి నెగెటివ్ వచ్చినందున నేటి నుండి పేషీకి యథావిధిగా వస్తారని భావిస్తున్నారు. ఇక తెలంగాణా కేసుల సంగతి చూస్తే రోజుకు కనీసం 2 వేల వరకు పాజిటివ్ కేసులు వస్తున్నాయి. ఈరోజు రిలీజ్ చేసిన బులెటిన్ లో కూడా రెండు వేలకు పైగానీ కరోనా కేసులు నమోదయ్యాయి.