ప్రపంచ వ్యాప్తంగా గత రెండేళ్ల నుంచి కరోనా వల్ల ఇబ్బందులు పడుతోంది. ఆల్ఫా, బీటా, డెల్టా, ఓమిక్రాన్ ఇలా తన రూపాన్ని మార్చకుంటూ…. ప్రజలపై దాడులు చేస్తూనే ఉంది. తాజాగా ఓమిక్రాన్ ఎక్స్ఈ వేరియంట్ భయపెడుతోంది. అయితే వాక్సిన్ల వల్ల ప్రజలకు రక్షణ లభిస్తోంది. తాగా ఐసీఎంఆర్ అధ్యయనంలో దేశీయ తయారీ టీకా కోవాగ్జిన్ కరోనాపై సమర్థవంతంగా పనిచేస్తుందని తేలింది.
కోవాగ్జిన్ టీకా రెండు డోసులు తీసుకున్నవారిలో రోగనిరోధక వ్యవస్థ అత్యధిక స్థాయిలో ఉన్నట్లు ఐసీఎంఆర్ అధ్యయనంలో తేలింది. బీటా, డెల్టా, ఓమిక్రాన్ వేరియంట్లను కోవాగ్జిన్ టీకా సమర్థవంతంగా ఎదుర్కొంటున్నట్లు ఐసీఎంఆర్ తెలిపింది. కరోనా వచ్చిన తర్వాత కోవాగ్జిన్ తీసుకున్న వారిలో కూడా ఇమ్యూనిటీ అధిక స్థాయిలో ఉన్నట్లు తేలింది. అయితే మూడు నెలల తర్వాత టీకా వల్ల లభించే ఇమ్యూనిటీ తగ్గుతున్నట్లు అధ్యయనంలో గుర్తించారు. కోవాగ్జిన్ టీకాను హైదరాబాద్ బేస్డ్ భారత్ బయోటెక్ సంస్థ ఉత్పత్తి చేస్తోంది.