మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. బీజేపీ పార్టీ ఎమ్మెల్యే పై తప్పుడుగా వ్యవహరించారని జర్నలిస్టుతో సహా కొందరు యువకుల బట్టలు విప్పించారు పోలీసులు. ఈ దారుణ ఘటన నిన్న మధ్య ప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. బీజేపీ ఎమ్మెల్యే కేదార్ నాథ్ శుక్లా, ఆయన కుమారుడిపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని నీరజ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అందుకు వ్యతిరేకంగా కొందరు నిరసన తెలిపారు.
అయితే.. స్థానిక జర్నలిస్ట్ కనిష్క తివారీ అక్కడికి వెళ్లగా.. అతనితో పాటు అందరినీ అరెస్టు చేశారు పోలీసులు. అక్కడితో ఆగకుండా.. బట్టలు విప్పించి.. డ్రాయర్లపై నిలిచో బెట్టారు. బట్టలుంటే వాటితో ఉరేసుకుంటారనే కారణంతోనే విప్పించామని పోలీసులు దానికి సమాధానం చెప్పారు. అయితే.. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన ఉన్నాతాధికారులు.. పోలీసులను సస్పెండ్ చేశారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రం సిద్ది జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వార్తలు వేస్తున్నారని యూట్యూబ్ జర్నలిస్టులను పోలీస్ స్టేషన్ లో ఇలా నిలబెట్టారు
ఇక్కడ రోజూ ఎలాంటి ఆధారాలు లేకుండా నోరు పారేసుకుంటున్న సన్నాసులకు ఈ లెక్కన సన్మానం చేయాలో ? pic.twitter.com/R96iXRj5Zk
— Sandeep Reddy Kothapally (@rjkothapally) April 7, 2022