వ్యాక్సిన్ వేయించాక వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఇవే.. రాష్ట్రాలకు కేంద్రం లేఖ !

-

ఈ రోజు భారత దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ ప్రక్రియ మొదలు కానుంది. దేశ వ్యాప్తంగా మూడు కోట్ల వ్యాక్సిన్ డోసులు ముందుగా మెడికల్, పారిశుద్ధ్య కార్మికులు మొదలైన ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ఇవ్వనున్నారు. ఇక వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత వచ్చే సాధారణ దుష్ప్రభావాల పై రాష్ట్రాలకు కేంద్రం లేఖలు రాసింది. వ్యాక్సిన్ వేయించాక వచ్చే స్వల్పమైన సైడ్ ఎఫెక్ట్స్ కు పారాసెట్మాల్ టాబ్లెట్ వేస్తే సరిపోతుంది అంటూ సూచనలు చేశారు.

vaccine
vaccine

ఇంజక్షన్ చేయించుకున్న చోట నొప్పి లేదా వాపు రావచ్చు అని కేంద్రం పేర్కొంది. అంతే కాక వ్యాక్సిన్ వేయించుకున్న వారికి తలనొప్పి ఉంటుందని ఎక్కువ అలసటగా ఫీలవుతారని అలానే వాంతి వచ్చేటట్లు ఉంటుందని కూడా పేర్కొంది. జ్వరం, ఒళ్లు నొప్పులు, పొత్తికడుపులో నొప్పి, తల తిప్పడం, వణుకు, దగ్గు వంటివి కూడా రావచ్చని కేంద్రం పేర్కొంది. ఇక ఎమర్జెన్సీ పరిస్థితుల్లో చికిత్స అందించడానికి ప్రతి వాక్సినేషన్ కు కూత వేటు దూరంలోనే ఐ సి యూ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఎప్పటిక ప్పుడు పరిస్థితిని ఆయా జిల్లా కలెక్టర్లు సమీక్షించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news