ప్రగతిభవన్​లో రక్షాబంధన్​ వేడుకలు… కేటీఆర్​కు రాఖీ కట్టిన కవిత

-

ప్రగతి భవన్​లో రక్షాబంధన్​ వేడుకలు ఘనంగా నిర్వహించారు. టిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్​కు ఆయన సోదరి మాజీ ఎంపీ కవిత రాఖీ కట్టారు. ప్రగతి భవన్​లో మంత్రి కేటీఆర్​ని కలిసిన తెరాస మహిళా నేతలు ఆయనకు రాఖీ కట్టారు.మంత్రి సత్యవతి రాఠోడ్​, లోక్​సభ సభ్యురాలు మాలోత్​ కవిత, ఎమ్మెల్యే సునీత రెడ్డి, జడ్పీ ఛైర్​పర్సన్​ గండ్ర జ్యోతి తదితరులు కేటీఆర్​కు రఖీ కట్టారు. ఎంపీ సంతోష్​కు కూడా … కవిత రాఖీ కట్టారు. వేడుకలో ముఖ్యమంత్రి కేసీఆర్​ సతీమణి శోభ, కేటీఆర్ సతీమణి శైలిమా ఉన్నారు.

Kavitha

రాఖీ పౌర్ణమి సందర్భంగా హైదరాబాద్ కొండాపూర్​లోని మంత్రి హరీశ్​రావు నివాసంలో ఆయనకు టిఆర్ఎస్ మహిళా నాయకులు రాఖీ కట్టారు. మంత్రి హరీశ్​రావు.. రాష్ట్ర ప్రజలందరికీ రక్షా బంధన్​ శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పర్వదినం సోదరసోదరీమణుల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక అని మంత్రి పేర్కొన్నారు. ఈ రక్షాబంధన్‌… సోదరీ, సోదరుల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేయాలని హరీశ్​రావు ఆకాంక్షించారు.
ఇంట్లోనే ఉంటూ… సురక్షిత వాతావరణంలో, ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకోవాలని మంత్రి సూచించారు. కరోనా వైరస్‌పై విజయం సాధించేందుకు అన్ని ముందస్తు జాగ్రత్తలను పాటిస్తామని ప్రతి ఒక్కరం ప్రతిజ్ఞ చేసి వాటిని పాటించాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version