రెండ నెలల్లో భారత్ లో కరోనా వ్యాక్సిన్ వినియోగం

Join Our Community
follow manalokam on social media

వచ్చే రెండు వారాల్లో పూణేకు చెందిన ఫార్మా కంపెనీ ‘కోవిషీల్డ్’ అత్యవసర వినియోగ అధికారం కోసం దరఖాస్తు చేసుకునే పనిలో ఉందని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ) సీఈఓ అదార్ పూనవల్లా శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కోవిషీల్డ్ ను సీరంతో కలిసి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం మరియు ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేస్తున్నారు. మొదట భారత్‌ కు వ్యాక్సిన్ సరఫరాపై దృష్టి సారిస్తుందని అదార్ పూనవల్లా చెప్పారు.

మాకు మొదట మన దేశాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం అని ఆయన చెప్పారు. ఆ తరువాత కోవాక్స్‌ కు సంబంధించి ఇతర దేశాలతో ఒప్పందం చేసుకుంటామని పేర్కొన్నారు. తక్కువ ఖర్చుతో కూడిన వ్యాక్సిన్ ని అందించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ప్రస్తుతానికి, వారు ఎన్ని మోతాదులను కొనుగోలు చేస్తారనే దానిపై భారత ప్రభుత్వం మాకు లిఖితపూర్వకంగా ఏమీ చెప్పలేదు. కాని 2021 జూలై నాటికి ఇది 300-400 మిలియన్ మోతాదులుగా ఉంటుందని అంచనా అని అదార్ పూనవల్లా తెలిపారు.

TOP STORIES

10వ త‌ర‌గ‌తి అర్హ‌త‌తో పోస్టాఫీస్‌లో ఉద్యోగాలు.. వెంట‌నే అప్లై చేయండి..!

తెలంగాణ స‌ర్కిల్‌లో గ్రామీణ్ డాక్ సేవ‌క్స్ (జీడీఎస్) పోస్టుల భ‌ర్తీకి గాను ఇండియా పోస్ట్ ఆస‌క్తి గ‌ల అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగానే...