వీళ్ళకి ధైర్యం నింపేది ఎవరు .. అర్ధమయ్యేలా చెప్పేది ఎవరు ?

-

కరోనా వైరస్ అంటే చాలామంది అదేదో పెద్ద జబ్బు అన్నట్టుగా ఫీల్ అవుతూ ఇటీవల చాలా మంది ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న పరిస్థితి మరియు వార్తలు పెట్టు చాలామంది మానసికంగా మరియు శారీరకంగా తీవ్ర క్షోభకు గురవుతున్నారు. ముఖ్యంగా కరుణ లక్షణాలతో ఆసుపత్రులు మరియు ఐసోలేషన్ వార్డుల్లో చేరిన వారు తీవ్ర మానసిక క్షోభకు గురి అవుతూ కరోనా వైరస్ వచ్చిందా లేదా అంశంతో సంబంధం లేకుండా…చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ఈ ఘటన జరిగింది. తాజాగా ఉత్తరప్రదేశ్ లో కూడా  షామ్లీ పట్టణానికి చెందిన 40 ఏళ్ల వ్యక్తి తనకు కరోనా వచ్చిందనే భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు.Healthcare Workers in China Hit Hard by Novel Coronavirusకరోనా వైరస్ లక్షణాలు ఉండటంతో యూపీ ప్రభుత్వం సదరు వ్యక్తిని రెండు రోజులుగా ఐసోలేషన్ వార్డులో ఉంచి పర్యవేక్షిస్తున్నారు అధికారులు. అతడి రక్త పరీక్షలకు సంబంధించిన రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. అయితే తనకు కరోనా వచ్చిందనే భయంతో తీవ్ర మానసిక వేదనకు గురైన ఆ వ్యక్తి… ఐసోలేషన్‌లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డిప్రెషన్ కారణంగానే అతడు ఆత్మహత్యకు పాల్పడినట్టు వైద్యులు తెలిపారు. ఇటువంటి సంఘటనలు దేశంలో చాలా చోట్ల జరుగుతున్నాయి.

 

దీంతో వారికి ధైర్యం నింపేది ఎవరు..? ప్రభుత్వాలే అర్థమయ్యేలా కరోనా వైరస్ గురించి క్షుణ్నంగా చెప్పాలని, అర్ధమైన రీతిలో చెప్పాలని చాలామంది అంటున్నారు. ఎక్కువగా ఈ వైరస్ ప్రభావం 60 ఏళ్ల పైబడిన వాళ్లపై అదికూడా రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వారికి మాత్రమే కొద్దిగా ప్రమాదమని వైద్యులు తెలియజేస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వాలు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిస్తున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news