ట్రయిల్స్ పూర్తి అయితే ఆస్ట్రేలియా శుభ వార్త చెప్పబోతోంది !

-

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ కి మందు కొనుక్కోడానికి ప్రపంచ దేశాలు తలకిందుల అవుతున్నాయి. చాలా మంది శాస్త్రవేత్తలు మరియు దేశాలు బాగా డబ్బులు ఖర్చు చేస్తున్నా ఒకపక్క ప్రయత్నాలు ప్రయోగాలు జరుగుతున్న ఇప్పటివరకు ఒక శుభవార్త కూడా వినపడలేదు. ఇటువంటి తరుణంలో అంతా ఓకే అయితే ముందుగా ప్రపంచంలో ఆస్ట్రేలియా శుభవార్త చెప్పే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. యూరప్ మరియు అగ్రరాజ్యం అమెరికాను అతలాకుతలం చేస్తున్నా ఈ వైరస్ ఆస్ట్రేలియాలో కూడా తన ప్రభావం చూపుతుంది.What Is a Coronavirus?ఇదిలా ఉండగా కామన్వెల్త్ దేశాల సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (సీసిరో), ఆస్ట్రేలియా అనుబంధ నేషనల్ సైన్స్ ఏజన్సీ, కరోనా వైరస్ నివారణకు వాక్సిన్ ను కనుగొని, దాని టెస్టింగ్ ప్రక్రియను ప్రారంభించింది. పరీక్షలకు ఆస్ట్రేలియన్ యానిమల్ హెల్త్ లాబొరేటరీలోని బయో సెక్యూరిటీ కేంద్రంలో మూడు నెలల్లో జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా, సీఈపీఐ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ)లు ఇప్పటికే కరోనా వాక్సిన్ ల తయారీకి సమర్థవంతంగా పనిచేసే అవకాశాలున్న పలు ఔషధాలను గుర్తించింది.

 

ఇందులో భాగంగా యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్ ఫర్ట్, ఇన్వియో ఫార్మాసూటికల్స్ తయారుచేసిన వాక్సిన్ తొలి క్లినికల్ ట్రయల్స్ కు అనుమతినిచ్చింది. ఆ తరువాత వాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కు తమకే అనుమతి లభించిందని సీసిరో ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. సో మొత్తం ట్రైన్స్ పూర్తయితే కరోనా వైరస్ కి వ్యాక్సిన్ కనిపెట్టినట్లు ఆస్ట్రేలియా శుభవార్త చెప్పబోతోంది అంటూ అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వినబడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news