తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ విజృంబిస్తున్న విషయం తెలిసిందే. రోజురోజుకు పెరిగిపోతున్న కేసులతో ప్రజల్లో తీవ్ర భయాందోళన నెలకొంటుంది. అదే సమయంలో ప్రభుత్వం కరోనా వైరస్ విషయంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. ఇక రాష్ట్రంలో కరోనా వైరస్ పరిస్థితిపై ఎప్పటికప్పుడు తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్… తెలుపుతూ ప్రజలకు సూచనలు సలహాలు ఇస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా తెలంగాణలో కరోనా వైరస్ పై స్పందించిన ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్… కరోనా కు మనిషిని చంపగలదు శక్తి లేదని కేవలం వెయ్యి రూపాయలు తోనే కరోనా వైరస్ తగ్గిపోతుంది అంటూ వ్యాఖ్యానించారు. ఖమ్మంలోని జిల్లా ఆస్పత్రిలో ట్రూనాట్ టెస్ట్ కేంద్రాన్ని మరో మంత్రి అజయ్ తో కలిసి ప్రారంభించారు ఈటల రాజేందర్. వెయ్యి మంది కరోనా వైరస్ బారిన పడితే కేవలం 200 బెడ్స్ మాత్రమే అవసరమవుతుందని… పిహెచ్సి స్థాయిలోనే కరోనా వైరస్ ను అంతం చేయవచ్చు అంటూ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. వైరస్ ను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అవసరమైన నిధులు కేటాయించారు అంటూ ఈ సందర్భంగా తెలిపారు ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్.