తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ బలపడాలని భావిస్తున్నట్టు వార్తలు వస్తూనే ఉన్నాయి గాని ఆ పార్టీ మాత్రం బలపడటం అనేది ఇప్పట్లో జరిగే అవకాశం లేదు అనేది చాలా మంది చెప్పే మాట. ఆ పార్టీకి సమర్ధ నాయకత్వం అనేది లేదు. నాయకులు ఉన్నా సరే వారిలో ఆధిపత్య పోరు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న విషయాల్లో కూడా వాళ్ళు ఎక్కువగా తగువులు పడుతూ ఉంటారు అనే వార్తలు కొన్ని రోజులుగా మనం వింటూనే ఉన్నాం. రాజకీయంగా బలంగా ఉండి బలపడే అవకాశం ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు కయ్యాలు పెట్టుకుంటున్నారు.
ఇప్పుడు అక్కడ పార్టీ బలపడాలి అంటే కొందరు నేతలను పక్కన పెట్టడమే మంచిది అనే భావన లో రాష్ట్ర పార్టీ నాయకత్వం ఉంది అనేది చాలా మంది చెప్పే మాట. రాజకీయంగా రేవంత్ రెడ్డి పార్టీకి బలం అవుతారు అనుకున్నా సరే అది సాధ్యం కావడం లేదు. ఆయన పార్టీకి పెద్దగా ఉపయోగం ఉండే అవకాశం లేదని ఆయన కారణంగా వర్గ విభేదాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ కుమార్ రెడ్డి వంటి వారి తో కలిసి పని చెయ్యాలి.
కాని రేవంత్ రెడ్డి కి కాస్త ఇగో ఉంటుంది అని దాని తోనే ఆయన కలిసి పని చేయడానికి ముందుకు రావడం లేదు అనేది చాలా మంది చెప్పే మాట. రాజకీయంగా రేవంత్ రెడ్డి కి మంచి భవిష్యత్తు ఉన్నా సరే ఆయనకు దూకుడు ఎక్కువగా ఉంటుంది. రాజకీయంగా ఇప్పుడు బిజెపి కూడా బలపడే ప్రయత్నాలు చేస్తుంది. ఆయనకు గాలం కూడా వేస్తుంది. కాని రేవంత్ కొంత మంది ఆంధ్రా నాయకుల మద్దతుతో తెలంగాణా కాంగ్రెస్ నెత్తి మీద కూర్చుని రాజకీయం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కి ఉపయోగం లేదు అనేది ఆ పార్టీ నాయకులు చెప్పే మాట.