కరోనా గుప్పిట్లో మరాఠా గ్రామాలు…!

-

కరోనాలో మహారాష్ట్ర పూర్తిగా మునిగిపోయిందా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. మహారాష్ట్రలో కరోనా కేసులు 320 నమోదు అయ్యాయి అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ముంబై, నాగపూర్, పూణే ప్రాంతాల్లో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో రెచ్చిపోతుంది. మహారాష్ట్రలో ఢిల్లీ మత ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన వారి నుంచి కరోనా ఎక్కువగా విస్తరించింది అని అధికారులు భావిస్తున్నారు.

పూణే చుట్టూ పక్కల ఉండే గ్రామాల్లో కరోనా వైరస్ విస్తరించింది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా వైరస్ అక్కడ ఎక్కువగా విస్తరించి ఉంటుంది అనే అనుమానాలు అధికారులు వ్యక్తం చేస్తున్నారు. పూణే నుంచి భారీగా విదేశాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు. అలాగే వాళ్లకు గుజరాత్ తో కూడా దగ్గరి సంబంధాలు ఉంటాయి. గుజరాత్ నుంచి పూణే నుంచి ఎక్కువగా విదేశాలకు వెళ్తారు. గుజరాత్ నుంచి కొందరు మహారాష్ట్రకు వచ్చారు.

వారి నుంచి కరోనా సోకి ఉండవచ్చు అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పూణే నుంచి ఢిల్లీ మత ప్రార్ధనలకు దాదాపు 200 మంది వెళ్ళారు. వారికి కూడా కరోన సోకి ఉండవచ్చు అంటూ ప్రభుత్వం భావిస్తుంది. నాగపూర్ పరిసర గ్రామాల్లో కూడా కరోనా వైరస్ ఎక్కువగా ఉందని సమాచారం. ఇక ముంబై మురికి వాడల్లో కూడా కరోనా వైరస్ విస్తరించి ఉండవచ్చు అనే అనుమానాలను అక్కడి ప్రభుత్వం వ్యక్తం చేస్తుంది. లాక్ డౌన్ ని ఈ ప్రాంతాల్లో కఠినం గా అమలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version