తమ దేశంలో కరోనా వైరస్ లేదని భావించిన చైనాకు ఇప్పుడు మళ్ళీ కరోనా చుక్కలు చూపిస్తుంది. కేసులు దాదాపు ప్రతీ రోజు వెయ్యికి పైగా నమోదు అవుతున్నాయి. బీజింగ్ సమీప నగరాలతో పాటుగా ఊహాన్ నగరాన్ని ఆనుకుని ఉన్న హుబే ప్రావిన్స్ లో విదేశీయులతో పాటు స్థానికులకు కూడా కరోనా వైరస్ బయటపడుతుంది. నిన్న ఒక్క రోజే హుబే ప్రావిన్స్ లో 600 కేసులు నమోదు అయ్యాయి.
ప్రభుత్వం కూడా ఇక్కడ చర్యలు కఠినం గా అమలు చేస్తుంది. ముందు కరోనా లేదని లాక్ డౌన్ ని ఊహాన్ లో ఎత్తేసింది చైనా. కాని అక్కడ మళ్ళీ కేసులు పెరగడంతో లాక్ డౌన్ ని మళ్ళీ విధించే అవకాశం ఉందని సమాచారం. అక్కడి వైద్య ఆరోగ్య శాఖ అంచనా ప్రకారం కొత్త కరోనా కేసులు అన్నీ కూడా లక్షణాలు లేకుండా నమోదు అవుతున్నాయి. హుబే ప్రావిన్స్ లో ఉండే విదేశీయులు ఎక్కువగా రష్యన్లే.
ముందు ఆ దేశంలో మూడు వేల మంది చనిపోయారు. ఆ తర్వాత కొన్ని విషయాలు బయటకు రావడం తో ముందు 1400 మరణాలను పెంచారు. ఇప్పుడు మళ్ళీ 6 వేలకు తీసుకుని వెళ్ళారు. అలాగే అకడ కేసుల విషయాన్ని కూడా చైనా సర్కార్ దాస్తుంది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జనాలు ఒకపక్క కరోనా వైరస్ తో చస్తున్నా సరే చైనా మాత్రం మారే అవకాశం ఏ విధంగా కూడా కనపడటం లేదు.
రెండు మూడు వారాల్లో చైనాలో కరోనా వెర్షన్ 2 కనపడటం ఖాయమని అమెరికా కూడా అంచనా వేస్తుంది. అక్కడ మరణాలను ఆపలేదు ప్రభుత్వం అని కూడా అంటుంది అమెరికా. అగ్ర రాజ్యం దీని వెనుక ఉందా అనే అనుమానాలు కూడా చైనా వ్యక్తం చేస్తుంది. ఇప్పుడు కేసుల తీవ్రత పెరిగితే చైనా ఏం చేస్తుందో చూడాలి. జీరో కేసులకు వెళ్లి ఇప్పుడు మళ్ళీ వెయ్యి మందికి బయటపడటం ప్రజలను భయపెడుతుంది.