పది నిమిషాలలో కరోనా పరిక్ష…!

-

కరోనా వైరస్ కట్టడి కావాలి అంటే ఒకటే మార్గం. కేసులు ఎంత త్వరగా బయటపడితే ప్రభుత్వాలకు దాన్ని కట్టడి చేయడం అనేది అంత సులువు అవుతుంది. లేకపోతే మాత్రం లాక్ డౌన్ లు సామాజిక దూరాలు కరోనా వైరస్ ని కట్టడి చేయలేవు. లేదా దానికి వ్యాక్సిన్ అయినా అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు పది నిమిషాలకే కరోనా పరీక్షను చేయడానికి దుబాయ్ రెడీ అయింది.

ప్రముఖ విమానయాన సంస్థ ఎమిరేట్స్‌ దుబాయ్‌ నుంచి వెళ్లే ప్రయాణికుల కోసం ఆన్‌సైట్‌ రాపిడ్‌ కొవిడ్‌-19 పరీక్షను అభివృద్ధి చేసింది. పది నిమిషాల్లోనే దీని ఫలితాలు అనేవి బయటకు వస్తాయి. చెకిన్‌ ఏరియాలో దుబాయ్‌ హెల్త్‌ అథారిటీ ఈ పరీక్షలను నిర్వహించే అవకాశం ఉంటుంది. విమానయాన పరిశ్రమలోనే తొలిసారిగా ఎమిరేట్స్‌ ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావడం గమనాహం.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో అన్ని విమాన సర్వీసులు ఆగిపోయాయి. తమ దేశానికి వెళ్లిపోవాలి అనుకునే విదేశీ పౌరుల కోసం ఎమిరేట్స్ ఇటీవల విమానాలను పునరుద్దరించింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కారణంగా విమానయాన సంస్థలు విమానాలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. మన దేశంలో కూడా జాతీయ అంతర్జాతీయ విమానాలు ఆగిపోయాయి.

Read more RELATED
Recommended to you

Latest news