స్మశానం పక్కన అరటి పళ్ళను ఏరుకుని తిన్న కూలీలు…!

-

కరోనా వైరస్ లాక్ డౌన్ ఏమో గాని పేదలు, వలస కూలీలు మాత్రం కంటి నిండా నిద్ర లేక, తినడానికి తిండి లేక బాగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళను ఆదుకునే వాళ్ళు ఎవరూ కూడా ముందుకి రావడం లేదు. ఒక్క తెలంగాణా సర్కార్ మినహా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా వారి కోసం ముందుకి వచ్చిన పరిస్థితి అనేది లేకుండా పోయింది. దీనిపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లక్షల మంది కూలీలు బాగా ఇబ్బందులు పడుతున్నారు.

తాజాగా ఒక దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. స్మశానం పక్కన పడేసిన అరటి పళ్ళను ఏరుకుని తిన్నారు. ఢిల్లీలోని యమునా నది ఒడ్డున ఓ శ్మశానం పక్కన పడేసిన అరటిపండ్లను ఏరుకుని ఒకరి మీద ఒకరు పడి తిన్నారు. ఎండలు బాగా ఉండటంతో అరటి పళ్ళను వ్యాపారులు తీసుకొచ్చి స్మశానం పక్కన పడేసారు. వాటిని వలస కూలీలు ఏరుకుని తినడం నిజంగా కన్నీరు పెట్టించింది. ఒక్క పండు కోసం ఎగబడ్డారు.

ఏమైనా మంచివి ఉన్నాయా అని వాళ్ళు వెతికి చూసిన వీడియో లు జాతీయ మీడియాలో ప్రసారం అయ్యాయి. ఇలా లక్షల మంది కూలీలు ఏది దొరికితే అది తినే పరిస్థితికి వచ్చారు. లాక్ డౌన్ ని అమలు చేసే ముందు ఒక్క రోజు సమయం ఇచ్చినా లేకపోతే ధర్మల్ స్క్రీనింగ్ చేసి వాళ్ళను సొంత ఊర్లకు పంపించినా సరే పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉండేది. ఇక వేల కిలోమీటర్లు నడిచి వెళ్తున్న సన్నివేశాలు సోషల్ మీడియాలో కన్నీరు తెప్పిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news